ప్రేమమ్ తర్వాత సవ్యసాచి

246
Savyasachi Trailer
- Advertisement -

ప్రేమమ్ తర్వాత తన కెరీర్‌లో హిట్‌గా నిలిచే చిత్రం సవ్యసాచి అవుతుందన్నారు హీరో నాగ చతన్య. బుధవారం హైదరాబాద్‌లో సవ్యసాచి ట్రైలర్‌ రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన చైతూ నా కెరీర్‌లో మర్చిపోలేని విజయాన్ని ‘ప్రేమమ్‌’ ద్వారా అందించాడు చందూ అందించాడని… ఆ సమయంలోనే ‘సవ్యసాచి’ కథ చెప్పాడని తెలిపారు.

మైత్రీ మూవీస్‌ చేరికతో మాకు మరింత బలం వచ్చిందని.. ఆ సంస్థతో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని ఉందన్నారు. సాఫీగా సాగిపోతున్న జీవితాన్ని పద్మవ్యూహంలోకి నెట్టేసింది. అయితే అందులో చిక్కు కోవడానికి తను అభిమన్యుడు కాదు.. అర్జునుడు. మరి ఆ సమస్యల్లోంచి ఎలా బయటపడ్డాడో తెలియాలంటే ‘సవ్యసాచి’ చూడాల్సిందే అన్నారు.

కీరవాణి మాట్లాడుతూ ‘చందూ పనితీరు నాకు బాగా నచ్చింది. కోపంలో ఓ మాట అన్నా పట్టించుకోడు. మనసులో పెట్టుకోకుండా ఎప్పట్లా నవ్వుతూ పలకరిస్తాడు. ఆ స్వభావంతోనే తనతో పనిచేయడం సులభమైంద’’న్నారు. నిధి అగర్వాల్‌ నాయిక. భూమిక, మాధవన్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -