శివ నిర్వాణ దర్శకత్వంలో చై-సామ్

228
samantha naga chaitanya
- Advertisement -

నాగచైతన్య – సమంత అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందించారు. పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి వెండితెరపై సందడి చేయనున్నారు. చై-సామ్ కాంబోలో ఫైస్‌ స్క్రీన్స్ సంస్థ నిర్మాణంలో మూవీ తెరకెక్కనుంది. నిన్నుకోరి వంటి వైవిధ్యమైన చిత్రాన్ని తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సోమవారం ఉదయం ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన చేతుల మీదుగా దర్శకుడికి అందజేశారు. నాగ చైతన్య, సమంత జంటగా ఇది నాలుగో చిత్రం. గతం వీరిద్దరూ వచ్చిన ఏం మాయ చేశావే, మనం,ఆటోనగర్ సూర్య సినిమాల్లో నటించారు. ఓవరాల్‌గా నాగ చైతన్యకు ఇది 17వ సినిమా. ఇతర నటీనటులు, సాంకేతిక విభాగం వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించనుంది.

naga chaitnaya samantha

నాగచైతన్య – సమంత ఇద్దరూ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు.

- Advertisement -