చైతన్యతో సమంత.. కొత్త సినిమా ?

34
- Advertisement -

విడాకుల తర్వాత నాగ చైతన్య, సమంత ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వాళ్లు బిజీ అయిపోయారు. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన కొత్తలో వీరిద్దరూ సినిమాల విషయమైనా ఏదైనా కలిసి కనిపించేవారు, చైతన్యతో సమంత కూడా చాలా అన్యోన్యంగా ఉండేది. అలాంటి వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోవడంతో అందరూ షాకయ్యారు. వీరి మధ్యన గొడవలొచ్చాయేమో అందుకే వీరు విడిపోయారనుకున్నారు. నిజానికి చైతన్య – సమంత సరోగసి ద్వారా ఓ బిడ్డను కూడా కనాలని ప్లాన్ చేశారు.

కానీ, ఎందుకో చైతన్య – సమంత మధ్య గ్యాప్ వచ్చింది. మొత్తానికి వీరిద్దరూ వీడిపోయారు. విడాకులయ్యాక కూడా వీరిద్దరూ ఫ్రెండ్లి గానే కనిపిస్తారు అనుకున్నారు. కానీ, అలా ఎప్పుడూ జరగలేదు. ఆ మధ్య చైతు ఓ ఇంటర్వ్యూలో తన మాజీ భార్య గురించి ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుతూ.. ‘సమంతతో నాకు ఎలాంటి గొడవలు లేవు, అసలు మేమిద్దరం ఎప్పుడూ గొడవపడేవాళ్ళం కాదు అంటూ చైతు చేసిన కామెంట్స్ ఆ మధ్య వైరల్ అయ్యాయి. పైగా చైతన్య ఇంకా మాట్లాడుతూ.. ‘నేను నా మాజీ భార్యతో చాలా బాగున్నాను’ అని చైతు చెప్పాడు.

కానీ, అసలు తమ మధ్య ఏం జరిగింది ? అని మాత్రం చైతు చెప్పలేదు. కాకపోతే, సమంత మాత్రం చాలా ఓపెన్ గా పెళ్లి అంటేనే పెద్ద తలనొప్పి, ఆ బంధం కోసం పోరాటం చెయ్యాలి’ అంటూ సమంత చెప్పింది. సమంత ఇంకా మాట్లాడుతూ.. ‘నేను కూడా కొన్ని ఛాలెంజెస్ ని ఫేస్ చేశాను. కానీ మేము అతనితో ఎప్పుడూ గొడవపడేవాళ్ళం కాదు, అభిప్రాయం భేదాలు వచ్చేవి.. కానీ ఎప్పుడూ గొడవ పడలేదు. మేము ఒకరినొకరం గౌరవించుకుంటాం, కానీ ఒకరిని ఒకరు అర్ధం చేసుకోలేకపోయాం’ అని సమంత కామెంట్స్ చేసింది. ఐతే, తాజాగా వీరిద్దరూ మళ్లీ కలిసి ఓ సినిమాలో నటించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. దర్శకుడు శివ నిర్వాణ వీరిద్దరి కోసం మరో కథ రాస్తున్నాడట.

Also Read:9 మందితో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా

- Advertisement -