- Advertisement -
నాగచైతన్య హీరోగా సాయి పల్లవి ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం తండేల్. ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కడమే కాదు బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల వసూళ్లను రాబట్టింది తండేల్. ఈ సినిమా తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టి సారించారు చైతూ.
తాజా సమాచారం ప్రకారం చైతూ….ప్రముఖ తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్తో ఓ కొత్త ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నాడట. గత రెండు రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
ఇరుంబు తిరై, సర్దార్ వంటి సినిమాలతో చురుకైన కథా, కథనం, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేలకు పేరుగాంచిన మిత్రన్ ఈసారి నాగ చైతన్యతో కలిసి ఒక సామాజిక నేపథ్య డ్రామా చేయనున్నాడని టాక్. ఇదే నిజమైతే చైతూ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Also Read:పవన్ ఓ అనాథ…ఇదే వీరమల్లు కథ!
- Advertisement -

