బీజేపీ నాయకత్వం క్షమాపణ చెప్పాలి అని ప్రధాని మోదీకి కేటీఆర్ సూటి ప్రశ్నలు వేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్.. మంత్రి లోకేశ్‌కి ఇచ్చిన భారత చిత్రపటంలో తెలంగాణ చిత్రం లేకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
భారతదేశ చిత్రపటం నుంచి తెలంగాణను తొలగించడంపై బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని, భౌగోళిక గుర్తింపుని గుర్తించకపోవడం బీజేపీ అధికారిక విధానమా అంటూ ప్రధాని మోదీని ప్రశ్నించారు.
ఒకవేళ ఇది పొరపాటున జరిగి ఉంటే, తెలంగాణ ప్రజలను అపహాస్యం చేసినందుకు గాను బీజేపీ నాయకత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Honourable PM @narendramodi ji,
We have fought for generations for our cultural identity, our rightful place in history, and our geographical position – TELANGANA
Today, your Andhra Pradesh state BJP chief; Madhav Garu, has belittled our struggle by gifting a United Andhra… pic.twitter.com/vbFi2t1g2i
— KTR (@KTRBRS) July 10, 2025
Also Read:చైతూ..ప్రాజెక్టు క్రేజీ అప్‌డేట్!

