‘లాల్‌సింగ్‌ చద్దా’ షూటింగ్‌లో నాగచైతన్య..

91
Naga Chaitanya
- Advertisement -

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమిర్‌ఖాన్‌ నటిస్తున్న హిందీ చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’తో టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగచైతన్య బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ విషయాన్ని తన సోషల్‌మీడియా అకౌంట్‌ ద్వారా శుక్రవారం అధికారికంగా ప్రకటింటిస్తూ లోకేషన్‌ ఫోటోను షేర్‌ చేశారు నాగచైతన్య. ఈ ఫోటోలో అమిర్‌ ఖాన్, కిరణ్‌రావు, ఈ చిత్ర దర్శకుడు అద్వైత్‌ చందన్‌ కలసిఉన్నారు.

అమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్, వయాకామ్‌ 18 సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆస్కార్‌ అవార్డు విన్నింగ్‌ ఫిల్మ్, హాలీవుడ్‌ కల్ట్‌ క్లాసిక్‌ ‘ఫారెస్ట్‌గంప్‌’ చిత్రానికి హిందీ రీమేక్‌గా ‘లాల్‌సింగ్‌ చద్దా’ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ లడక్‌లో జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రయూనిట్‌ త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.

- Advertisement -