హారర్ వెబ్ సిరీస్‌లో అక్కినేని హీరో..!

19

అక్కినేని హీరో నాగ చైతన్య కథానాయకుడిగా ప్రస్తుతం ‘థ్యాంక్యూ’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణ జరుపుకుంది. అయితే ఈ సినిమా తరువాత చైతూతో విక్రమ్ కుమార్‌తో ఒక వెబ్ సిరీస్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ వెబ్ సిరీస్ పట్టాలెక్కుతుందని సమాచారం. ఇది హారర్ నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్ తెరకెక్కనుందని తెలుస్తోంది.

హారర్ కథలను హ్యాండిల్ చేయడంలో విక్రమ్ కుమార్ చేయితిరిగినవాడే. తమిళంలో ఆయన చేసిన హారర్ థ్రిల్లర్ ’13 B’ వివిధ భాషల్లో విజయవంతమైంది. మాధవన్ కెరియర్లోనే ప్రత్యేక చిత్రంగా నిలిచింది. అయితే తనకి హారర్ సినిమాలంటే భయమన్న చైతూ ఒ టైంలో వెల్లడించాడు. మరి ఈ హారర్ వెబ్ సిరీస్‌లో ఎలా చేస్తాడో చూడాలి.