ఆక్సిజ‌న్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

21
ktr

హైదరాబాద్, స‌న‌త్‌న‌గ‌ర్ సెయింట్ థెరిస్సా హాస్పిట‌ల్‌లో టెక్ మహీంద్రా సంస్థ విరాళంతో ఏర్పాటు చేసిన ఆక్సిజ‌న్ ప్లాంట్‌ను మరియు 7 అంబులెన్స్‌ల‌ను మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని, ఐటీ మరియు పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు. మహీంద్రా గ్రూప్ సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం సంతోష‌మ‌ని.. భ‌విష్య‌త్‌లో మ‌హీంద్రా గ్రూప్ మ‌రిన్ని రంగాల్లో రాణించాల‌ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు.