“వెంకీమామ” లో రానా..

241
venkatesh rana Nagachaitanya

అక్కినేని నాగ‌చైత‌న్య‌, విక్ట‌రీ వెంకటేశ్ హీరోలుగా వెంకీమామా అనే మల్టీస్టార‌ర్ మూవీ తెరకెక్క‌నున్న విష‌యం తెలిసిందే. ద‌ర్శ‌కుడు బాబీ ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా కోన ఫిల్మ్ కార్పొరేషన్ .. సురేశ్ ప్రొడక్షన్స్ .. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ కామెడీ ఎంట‌ర్టైన‌ర్లో నాగ చైతన్య స‌ర‌స‌న ర‌కుల్ ప్రిత్ సింగ్, వెంక‌టేశ్ స‌ర‌న శ్రీయ లు హీరోయిన్లుగా న‌టించ‌నున్నారు.

 Venkatesh naga chaitanya

ఈమూవీకి సంబంధించిన ఓవార్త నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈసినిమాలో రానా ప్ర‌త్యేక పాత్ర‌లో కనిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. మామ అల్లుళ్లు జోడిగా న‌టిస్తోన్న ఈసినిమాలో రానా న‌టించ‌డంతో మ‌రింత క్రేజ్ ఏర్ప‌డ‌నుంది. బాబాయ్ వెంకటేశ్ తో కలిసి నటించాలని ఉందనే విష‌యాన్ని తెలిపిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే పూజా కార్య‌క్రమాలు పూర్తి చేసుకున్న ఈమూవీ ఫిబ్ర‌వ‌రి 21నుంచి ఈసినిమా రెగ్యూల‌ర్ షూటింగ్ ను ప్రారంభించ‌నున్నారు.

 venkymama

ద‌స‌రా కానుక‌గా ఈచిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు చిత్ర‌యూనిట్. వెంక‌టేశ్ తాజాగా న‌టించిన ఎఫ్ 2 చిత్రం ఘ‌న విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అలాగే ద‌ర్శ‌కుడు బాబీ చివ‌ర‌గా తెర‌కెక్కించిన జైల‌వ‌కుశ మూవీ భారీ విజ‌యాన్ని సాధించింది. కామెడీ ఎంటర్టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈచిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏవిధంగా మెప్పిస్తుందో చూడాలి మ‌రి.