బాలీవుడ్ లోకి టాలీవుడ్ చందమామ

643
Kajal Agarwal
- Advertisement -

లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆమె ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరుగా కొనసాగుతుంది. ప్రస్తుతం కాజల్ తెలుగు, తమిళ్ సినిమాల్లో బిజీగా ఉంది. సీనియర్ హీరోయిలతో పాటు చిన్న చిన్న హీరోల సరసన కూడా నటిస్తోంది కాజల్. తెలుగులో ఇటివలే శర్వానంద్ సరసన రణరంగం మూవీలో నటించింది.

మరోవైపు కమల్-శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం `భారతీయుడు2`లో నటిస్తోంది. ఇదీ కాక శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సూర్యతో జ‌త‌క‌ట్ట‌నుంది కాజ‌ల్‌. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం కాజల్ మరో బంపర్ ఆఫర్ ను కొట్టేసినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.

John-Abraham-in-Mumbai-Saga-Kajal-Aggarwal

ముంబై సగ అనే హిందీ మూవీలో కాజల్ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తుంది. ఈమూవీలో జాన్ అబ్రహంతో కలిసి కాజల్ అగర్వాల్ రోమాన్స్ చేయనుంది. సంజ‌య్ గుప్తా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్ కీల‌క పాత్ర‌లు పోషించ‌నున్నార‌ని స‌మాచారం. త్వరలోనే కాజల్ ఈమూవీ షూటింగ్ లో పాల్గోననుందని సమాచారం.

- Advertisement -