కుక్క పిల్లతో సమంత….

250
Naga chaitanya and samantha with dog
- Advertisement -

టాలీవుడ్‌ ప్రేమపక్షులు నాగచైతన్యసమంతల ఎంగేజ్మెంట్‌ ఫిబ్రవరి14న జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఎవరికి తెలియకుండా రహస్యంగా నిశ్చితార్థం చేసుకుని ఆ తర్వాత ట్వీట్టర్‌ ద్వారా వెల్లడించింది ఈజంట. త్వరలో ఒకటి కాబోతోన్నా ఈ జంట నిన్నటి ఆదివారం రోజున బాగానే ఎంజాయి చేశారు.

Naga chaitanya and samantha with dogఒక విధంగా రియల్ లైఫ్ సెలబ్రిటీ లవ్ స్టోరీలలో ఓ బెంచ్ మార్క్ సృష్టించే రేంజ్ లో కథ నడిపించారు అక్కినేని నాగచైతన్య-సమంత. ఈ ఆదివారం మొత్తం తన కాబోయే బెటరాఫ్ కి కేటాయించేసుకున్నారు వీరిద్దరు. చైతుతో కలిసి.. ఆదివారం ఎంజాయ్ చేశానంటూ.. సమంత తెగ గొప్పలు చెబుతుంది. అంతేనా.. ‘ఆదివారాలు పర్ఫెక్ట్ గా ఉండాలి బాబూ’ అంటూ కూడా సలహాలు కూడా ఇస్తోంది ఈబ్యూటీ.

ఎవరికైన ప్రేమించి ప్రియుడు పక్కన ఉంటే ఏ అమ్మాయికైన హుషారు తన్నుకొస్తుంది. అయితే ఆదివారం మాత్రం సమంత ముఖంలో చాలా ఆనందంగా కనిపించింది. సమంత తన కుక్కపిల్లతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్న క్షణాలను…వెనక కుర్చీలో కూర్చుని ముచ్చటగా తిలకిస్తున్నాడు తనకు కాబోయే ప్రియుడు చైతు. వీకెండ్స్‌ కోసం ఏవరైన పబ్‌లకు పార్టీలకు వెళ్తారు కానీ ఈ జంట కుక్కపిల్లతో ఎంజాయి చేస్తున్నారు అంటూ ఈఫోటో చూసి పలువురు నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు. మొత్తం మీద సౌత్ బ్యూటీ సమంత ఈ సండే తన ప్రియుడు, కుక్కపిల్లతో చాలా సంతోషంగా గడిపిందట. సమంత వేసుకున్న సండే ప్లానింగ్‌ పర్ఫెక్ట్ అండ్ సింపుల్  అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్‌.

ప్రస్తుతం ఈఫోటో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. అక్కినేని,సమంత ఫ్యాన్స్‌ ఈ ఫోటోను తెగ షేర్‌ చేసి ముచ్చటైన జంట అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

- Advertisement -