నాగచైతన్య, సమంత @5

747
Nagachaitanya Samantha
- Advertisement -

నాగ చైతన్య సమంత ఏమాయ చేసావే సినిమాలో తొలిసారిగా కలిసి నటించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం వీరిద్దరు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అయితే ఇప్పటి వరకు వీళ్లు నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. అయితే పెళ్లైన తర్వాత గ్లామర్ పాత్రలు కాకుండా కథకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లోనే నటిస్తుంది సమంత. చివరగా వీరిద్దరు కలిసి మజిలీ సినిమాలో నటించారు. తాజాగా మరో సినిమాలో చై సామ్ నటించనున్నట్లు తెలుస్తుంది.

ఇటివలే వెంకీమామ సినిమాలో నటించిన నాగ చైతన్య తన 20వ మూవీని గీతా గోవిందం మూవీ దర్శకుడు పరుశురామ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇటివలే ఈసినిమాపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. ఈమూవీలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని చిత్రయూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఇందుకు సమంత ఒప్పుకుంటుందో లేదో చూడాలి. జనవరి నుంచి ఈమూవీ రెగ్యలర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈమూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఎప్రీల్ లో ఈమూవీ విడుదలకానుంది.

- Advertisement -