శనివారం గుంటూరులోని హైలాండ్ గ్రౌండ్ లో చిరంజీవి ఖైదీ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఓ వైపు ఎంతో సందడిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం 150’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సాగుతుంటే….మెగా బ్రదర్ నాగబాబు ఇద్దరు వ్యక్తులపై నిప్పులు చెరుగుతూ కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అయింది. మెగా ఫ్యామిలీపై కొంతమంది అనవసర కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిత్వ వికాసం పాఠాలు చెప్పుకునే ఒకడు చరణ్ బాబు ను తక్కువ చేసిన మాట్లాడని..ఆయన ఒక రచనా వ్యాసంగ నిపుణుడు. కనిపిస్తే కాళ్లకు దండం పెడతాను. కానీ అతనొక మూర్ఖుడు. వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పే వాడికి అసలువ్యక్తిత్వం లేదు, వాడో కుసంస్కారి….అలాంటి వాడు చేసే కామెంట్స్ తమకు ఎలాంటి నష్టాన్ని కలిగించవు, వాడెవడో నేను చెప్పను, నా మాటలు వాడికి అర్ధమవుతుందన్నారు.
ఇక ఇన్‌డైరెక్టర్ గా వర్మపై విమర్శనస్త్రాలు సందించాడు నాగబాబు..తెలుగు సినిమా పరిశ్రమ నుండి ముంబై వెళ్లి అక్కడ సినిమాలు తీసుకుంటున్న ఒకడు ట్విట్టర్లొ ఎప్పడూ ఏదో ఒకటి వాగుతుంటాడు,,బొంబాయికి వెళ్లిన వాడు అక్కడ బాంబులు పేల్చుకుంటే వాడికి మంచిది మాకు మంచిది అని ఫైర్ అయ్యాడు. చిరంజీవిగారి సినిమా ఎలా ఉండాలి.. చిరంజీవి గారు ఎలా యాక్ట్ చేయాలి వాడు ఆన్‌లైన్ ద్వారా వాగుతుంటాడన్నారు. వాడో అక్కు పక్షి….వాడికి ఇపుడు సినిమాలు తీయడం చేతకావడంలేదు, పిచ్చికూతలు కూస్తున్నాడు. ముందు వాడు మంచి సినిమాలు తీయడంపై దృష్టి పెడితే బాగుంటుందని హెచ్చరించారు. ఎవరేం చేసినా హిట్టయ్యే సినిమాను ఆపలేరు…ఫెయిలయ్యే సినిమాను లేపలేరు అని నాగబాబు చెప్పుకొచ్చారు.