విజయశాంతి మళ్లీ వస్తుంది….!

256

తెలుగుచలనచిత్ర పరిశ్రమలో టాప్‌హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్‌ విజయశాంతి. అందమే కాకుండా హావభావాలు కూడా అద్భుతంగా పండిచే నటిగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. లేడీ ఒరియెంటెడ్‌ చిత్రాల్లో నటించి సూపర్‌ డూపర్‌ హిట్‌లు తన ఖాతలో వేసుకుంది విజయశాంతి.

Vijayashanthi Reentry

రాములమ్మ తెలుగు భాషలోనే కాకుండా తమిళ,మలయాళం,కన్నడ,హిందీతో సహా ఏడు భాషల్లో 185పైగా చిత్రాల్లో నటించి అభిమానులను మెప్పించింది. అందుకే విజయశాంతిని లేడీ అమితాబ్‌గా పిలుచుకుంటారు అభిమానులు. అయితే కొన్నిరోజుల తర్వాత సినిమాలు వరసగా ప్లాప్‌ అవ్వడంతో రాములమ్మ రూటు మార్చి రాజకీయ రంగ ప్రవేశం చేసింది. ఆమెకు రాజకీయల్లో కూడా కలిసి రాక పోవడంతో ఇప్పుడు రాములమ్మ మళ్లీ యూటర్న్‌ తీసుకుంటున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు మొదలైయ్యాయి.

ఇటీవలే చిరంజీవి ఖైదీనెంబర్‌150లో విజయశాంతి నటిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అదే కాకుండా మరో రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న ఫిల్మ్‌నగర్‌లో వార్తలు షికార్లు చేశాయి. ఒకప్పుడు లేడీ ఒరియెంటెడ్‌ సినిమాలు బాగా కాసులు కురిపించిన హీరోయిన్‌ ఎవరైన ఉన్నార అంటే అది కేవలం విజయశాంతినే. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణల కంటే ఎక్కువగానే రెమ్యునరేషన్‌ తీసుకునేదట రాములమ్మ.

Vijayashanthi Reentry

తనకు ఏ పాత్రతో అయితే మంచిపేరు తెచ్చిపెట్టిందో అదే పాత్ర,…..యాక్షన్‌ సినిమాతో రాములమ్మ టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తున్నాట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు జోరుదుకున్నాయి. అయితే ఈ సినిమా ఓసే రాములమ్మా టైపు ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తారని సమాచారం.అయితే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెలువడలేదు.