బీప్ వేసుకోండి..నాగబాబు బూతులు

297
nagababu
- Advertisement -

జనసేనాని పవన్ కల్యాణ్‌పై ఈగ వాలిన సహించని మెగా బ్రదర్ నాగబాబు..పవన్‌పై విమర్శలు చేస్తున్న వారికి స్ట్రాంగ్ సమాధానం ఇచ్చారు. పవన్‌ ప్యాకేజీలు తీసుకోరని గతంలో చిరంజీవిపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయన్నారు. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన వీటికి సమాధానం చెప్పేముందు ముందుగా బీప్‌వేసుకోండని బూతుపురాణం మొదలుపెట్టారు.

పవన్‌పై ఇలాంటి ఆరోపణలు చేసేవాళ్లని చెప్పుతీసుకుని కొడతా అని మండిపడ్డారు. ప్యాకేజ్ అంటూ కామెంట్ చేసిన వాళ్లు బాస్టర్డ్‌.. వాళ్లని నేను బాస్టర్డ్‌ అనే అంటా అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.కళ్యాణ్ బాబు ప్యాకేజ్‌లు తీసుకున్నారా? ఆయనకు ఏం అవసరం. వీళ్లు ఇచ్చేది ఆయన సినిమాలు చేస్తే.. ఒకరోజు సంపాదన కాదు. ఏడాదికి 150 కోట్లు సంపాదించే సత్తా కళ్యాణ్‌కి ఉందన్నారు.పవన్ కళ్యాణ్‌ని ప్యాకేజీలు తీసుకున్నారంటూ విమర్శిస్తే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీతో పవన్ పనిచేశారని అనడం సరికాదన్నారు.2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి అనుభవం ఉన్ననాయకుడి అవసరం ఉందని అందుకే టీడీపీకి మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు. చంద్రబాబు సత్య హరిశ్చంద్రుడు అని ఆయనకి సపోర్ట్ చేయలేదు. కానీ జగన్‌,చంద్రబాబు ఇద్దరిలో చంద్రబాబు తప్ప వేరే ఆప్షన్ కళ్యాణ్ కి కనిపించలేదన్నారు. ప్రజా సమస్యలపైనే చంద్రబాబును పవన్‌ కలిశారని తర్వాత చాలా విషయాల్లో విభేదించారన్నారు.

- Advertisement -