ఆక్సిజ‌న్ లేక చ‌నిపోవ‌డం దేశానికే అవ‌మాన‌క‌రం…

31
etela

ఆక్సిజ‌న్ లేక చ‌నిపోవ‌డం దేశానికే అవ‌మాన‌క‌రం అన్నారు మంత్రి ఈటల రాజేందర్. మీడియాతో మాట్లాడిన ఈటల…తెలంగాణ‌లో 4 రాష్ర్టాల‌కు చెందిన రోగుల‌కు చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు. బీజేపీ నేత‌లు బాధ్య‌తారాహిత్యంగా మాట్లాడుతున్నారని….. అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకుని రాష్ర్టాల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాదన్నారు.

బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో ప‌రిశీలించి మాట్లాడితే బాగుంటుందని సూచించారు ఈటల. క‌రోనా రోగులు స‌రిపడా ఆక్సిజ‌న్ లేక చ‌నిపోవ‌డం దేశానికి అవ‌మాన‌క‌రం అన్నారు. తెలంగాణ‌కు 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజ‌న్ కావాల‌ని కోరాం. కానీ రాష్ర్టానికి 306 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను మాత్ర‌మే కేటాయించిందన్నారు.

బీజేపీ నేతలు అనుసరించిన విధానాల వల్ల సాయం చేసే స్థితి నుంచి చిన్న దేశాల సాయం పొందే ప‌రిస్థితి భార‌త్‌కు వ‌చ్చింద‌ని ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు.
రాష్ర్టానికి ద‌గ్గ‌ర ప్రాంతాల నుంచి ఆక్సిజ‌న్ ఇవ్వాల‌ని కోరిన‌ప్ప‌టికీ వేల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న రాష్ర్టాల నుంచి ఆక్సిజ‌న్ ను కేటాయించారని మండిపడ్డారు.