పాలకొల్లులో ఏంజెల్ సందడి

445
- Advertisement -

యంగ్ హీరో నాగఅన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బాపటెల్ కలయికలో తెరకెక్కుతోన్న సినిమా ఏంజెల్. రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే హైదరాబాద్ పరిశర ప్రాంతాల్లో తొలి దశ షూటింగ్ పూర్తి చేసుకుంది. అలానే ఏంజెల్ యూనిట్ అక్టోబర్ 15 నుంచి పాలకొల్లులో శరవేగంగా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ని జరుపుకుంటోంది.

Angel movie
ఈ నేపధ్యంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చిత్రీకరణ జరుగుతుండటం పట్ల ఏంజెల్ నిర్మాత భువన్ సాగర్ ఆనందం వ్యక్తం చేశారు. అక్టోబర్ 30 వరకు షూటింగ్ జరుగుతోందని భువన్ తెలిపారు. ఇక సోషియో ఫాంటసీ అండ్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సప్తగిరి, ప్రదీప్ రావత్, షియాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Angel movie

బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సెస్సరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా ముంబైలో ఈ సినిమా పాటల రికార్డింగ్ ని పూర్తి చేశారు భీమ్స్. ముప్పా వెంగయ్య చౌదరి సమర్పణలో సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై భువన్ సాగర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచన : శ్రీనివాస్ లంకపల్లి, ఆర్ట్‌: వి.ఎస్. సాయిమణి, స్టంట్స్‌: రామ్ లక్ష్మణ్, డైలాగ్స్‌: వేంపల్లి రమేశ్ రెడ్డి, ఎడిటర్‌: చోట.కె.ప్రసాద్, సినిమాటోగ్రఫీ: గుణ.

- Advertisement -