- Advertisement -
ఏపీలో టీడీపీ ఘోర ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబు నాయకత్వంపై నీలినీడలు కమ్ముకోగా చాలామంది జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరమీదకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ సీఎం నాదేండ్ల భాస్కర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనకి జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదన్నారు. ఆయన సినిమాలు చూడలేదని…టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్కి ఇస్తారన్న వార్తలపై నందమూరి కుటుంబ సభ్యులు స్పందించాలన్నారు. అంతేగాదు తన కుమారుడు నాదేండ్ల మనోహర్ రావు జనసేనలోకి వెళ్లడం తప్పిదమేనన్నారు.
రామ్ గోపాల్ వర్మ , నటుడు బ్రహ్మాజీ, వైసీపీ మంత్రి నాని లాంటి వాళ్లు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే తిరిగి టిడిపిలో జవసత్వాలు నింపీ పార్టీని బలోపేతం చేస్తారని చెప్పుకొచ్చారు . ఈ నేపథ్యంలో నాదేండ్ల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
- Advertisement -