నితిన్‌తో త‌మ‌న్నా, న‌భా న‌టేష్ రొమాన్స్‌!

296
tamanna
- Advertisement -

హిందీ సూప‌ర్ హిట్ ఫిల్మ్ ‘అంధాధున్‌’కు అఫిషియ‌ల్ తెలుగు రీమేక్‌లో నితిన్ హీరోగా న‌టిస్తుండ‌గా, మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నవంబ‌ర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్న‌ది. ఒరిజిన‌ల్‌లో ట‌బు, రాధికా ఆప్టే పోషించిన పాత్ర‌ల‌కు త‌మ‌న్నా, న‌భా న‌టేష్ ఎంపిక‌య్యారు.

‘అంధాధున్‌’లో త‌న న‌ట‌న‌తో ట‌బు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అమితంగా పొంద‌డంతో పాటు ఫిల్మ్‌ఫేర్ స‌హా ప‌లు అవార్డుల‌ను గెలుచుకున్నారు. ఇప్పుడు ప‌లు షేడ్స్ ఉండే ఆ రోల్‌ను చేసే స‌వాలును స్వీక‌రించారు త‌మ‌న్నా.ప్ర‌తి పాత్ర‌కూ ప్రాధాన్యం ఉండే ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశం ల‌భించినందుకు న‌భా న‌టేష్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 6గా త‌యార‌య్యే ఈ చిత్రాన్ని ఎన్‌. సుధాక‌ర్‌రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తుండ‌గా, ఠాగూర్ మ‌ధు స‌మ‌ర్పిస్తున్నారు.

మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి హ‌రి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి ప‌నిచేసే ఇత‌ర తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.

సాంకేతిక బృందం:
సంగీతం: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: హ‌రి కె. వేదాంత్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఠాగూర్ మ‌ధు
నిర్మాత‌లు: ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి
సంభాష‌ణ‌లు, ద‌ర్శ‌క‌త్వం: మేర్ల‌పాక గాంధీ
బ్యాన‌ర్‌: శ్రేష్ఠ్ మూవీస్‌

- Advertisement -