RRR:నా వల్లే ఆస్కార్ వచ్చింది..అజయ్‌

48
- Advertisement -

తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకునేలా చేసిన సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాను గతేడాది విడుదలైంది. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా అనేక అవార్డులు వరించాయి. ఇటీవలే ఈ చిత్రంలోని నాటునాటు పాటకు బెస్ట్‌ ఒరిజనల్‌ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌ అవార్డు వరించింది. అయితే బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ప్రస్తుతం అజయ్‌ దేవ్‌గణ్‌ భోళా చిత్రంలో నటిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా కామెడీ రియాలిటీ షో ది కపిల్ శర్మ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కపిల్‌ శర్మ..నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల అజయ్‌ను ప్రశ్నించారు.

ఈ సందర్భంగా హోస్ట్‌ కపిల్‌శర్మ మాట్లాడుతూ..మీరు నటించిన సినిమాకు ఆస్కార్‌ రావడం ఎలా అనిపించింది. అని అడగ్గా…తనవల్లే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్‌ వచ్చిందంటూ అజయ్‌ సమాధానం ఇచ్చారు. దీంతో ఒక్కాసారిగా షాకైన కపిల్‌..అదెలా అని అడిగారు. నాటు నాటు పాటలో తాను డ్యాన్స్‌ చేయలేదు కాబట్టి ఆస్కార్‌ అవార్డు వచ్చిందంటూ ఛలోక్తి విసిరారు. నాటు నాటు పాటలో నేను డ్యాన్స్‌ చేసి ఉంటే పరిస్థితేంటి..? నా డ్యాన్స్ చూసి అకాడమీ జ్యూరీ మెంబర్స్‌ ఆస్కార్ ఇచ్చే వారు కాదు. నేను డ్యాన్స్ చేయకపోవడం వల్లే ఆ పాటకు ఆస్కార్‌కు వచ్చింది. అంటూ తనపైనే తను సెటైర్‌ వేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియా వైరల్‌ అవుతుంది.

ఇవి కూడా చదవండి…

vishwak:దాస్‌ కా ధమ్కీ 2nd డే కలెక్షన్స్

chiranjeevi:రంగమార్తాండ..భావోద్వేగానికి గురయ్యా:చిరంజీవి.!

Pooja Hegde:పూజా హెగ్దే ప్రేమ పురాణం మళ్లీ వైరల్

- Advertisement -