మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం డీజే సినిమాలో బిజీగా ఉన్నాడు. దర్శకుడు హరీష్ శంకర్ డైరక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. పూజా హెగ్దే ఈమూవీలో హీరోయిగా నటిస్తుంది. ఈ మూవీలో అల్లు అర్జున్ ‘అదుర్స్’ సినిమాలో జూనియర్ చేసిన చారి పాత్ర తరహాలో కనిపించనున్నాడు.
‘దువ్వాడ జగన్నాథం’ సినిమా తర్వాత లింగుస్వామితో ఓ సినిమా కమిట్ అయిన బన్ని దానితో పాటుగా రచయిత వక్కంతం వంశీ డెబ్యూ మూవీకి సైన్ చేశాడు. మొన్నటిదాకా చర్చల దశలో ఉన్న ఈ సినిమా ఇప్పుడు టైటిల్ కూడా కన్ఫాం అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమాని లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు. తన ప్రొడక్షన్లో ఇప్పటిదాకా బడ్జెట్ సినిమాలనే తీసుకుంటూ వచ్చిన శ్రీదర్ ఇప్పుడు బన్నీ సినిమాను నిర్మించేందుకు రెడీ అయ్యాడు.
ఈ సినిమా టైటిల్‌ని నాపేరు సూర్య నాఇల్లు ఇండియా అని ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేయించడట. బన్నీ సినిమా కోసమే ఈటైటిల్ను రిజిస్టర్ చేయించినట్టు టాలీవుడ్లో వినిపిస్తున్న సమాచారం. దీనితోపాటు మరికొన్ని పేర్లను కూడా అనుకుంటున్నప్పటికీ బన్నీకి ఈ టైటిలే నచ్చిందట. అందుకే ఈ పేరునే ఖరారు చేయాలని డిసైడ్ అయిందట చిత్ర యూనిట్. ఇలా టైటిల్ పేరు బయటకురాగనే బన్నీ ఫ్యాన్స్‌లో ఉత్సాహం మొదలైంది.
అంతే కాకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ టైటిల్ తో సోషల్‌మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు ఈటైటిల్ సామాజిక మాధ్యమల్లో ట్రెండింగ్‌లో ఉంది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అని పవర్ ఫుల్ గా చెప్పే బన్ని సినిమాలో ఎలా ఉండబోతాడా అని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ ఎదురుచూస్తున్నారు. అల్లుఅర్జున్ డీజే పూర్తికాగానే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మేకర్స్ బ్యానర్‌పై మే 19న ‘దువ్వాడ జగన్నాథం’ రిలీజ్ కానున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.