స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం తొలిరోజు రికార్డు వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 40 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో రూ.15.50 కోట్లు,డిస్టిబ్యూటర్ షేర్‌తో రూ.22.75 కోట్ల గ్రాస్ రాబట్టిందని సమాచారం.
బన్నీ సినిమా అంటే కంటెంట్ డిఫరెంట్ గా వుంటుందనే నమ్మకం కారణంగా ఈ సినిమాకి ఈ స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయని అంటున్నారు. శని,ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరగడం ఖాయం కనుక, మూడు రోజుల వసూళ్లు రికార్డు స్థాయిలో ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రూ.60 కోట్ల వ్యయంతో సినిమాను తెరకెక్కించగా.. హిందీ, తెలుగు శాటిలైట్ రైట్స్ రూపంలో రూ.24 కోట్లు వచ్చాయి. సైనికుడిగా బన్నీ చక్కటి నటన కనబర్చడం, యూత్, మాస్‌ను ఆకట్టుకునేలా యాక్షన్ సీన్లు ఉండటంతో.. ఈ మూవీ సేఫ్ జోన్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీతో వక్కంతం వంశీ డైరెక్టర్‌గా మారగా.. అను ఇమ్మాన్యుయేల్ బన్నీ సరసన హీరోయిన్గా నటించింది. ఈ మూవీని తెలుగుతోపాటు తమిళం, మళయాళ భాషల్లో విడుదల చేశారు.