రజినీ ‘కాలా’ ఆడియో లాంచ్‌..

255
Rajinikanth's 'Kaala' audio launch
- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రం ‘కాలా’. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన నాటి నుంచే ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ‘కబాలి’ చిత్రానికి దర్శకత్వం వహించిన పారంజిత్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. ఇక టీజర్‌తో సూపర్ స్టార్ స్టామినా ఎంటో మరోసారి రుజువు చేశారు తలైవా.

 Rajinikanth's 'Kaala' audio launch

ఈ మూవీలో రజినీని సరికొత్త గెటప్‌లో చూపించాడు దర్శకుడు. నల్లటి దుస్తువులతో కనిపించే ఆయన డ్రెసింగ్ సూపర్భ్ అనిపిస్తుంది. రజినీకాంత్ అల్లుడు ధనుష్ సమర్పణలో ఉండర్‌బార్ ఫిల్మ్స్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాయి. ఇక విషయానికొస్తే ఈ సినిమాకు సంబంధించి ఆడియో లాంచ్‌ను ఈ నెల 9వ తేదీన చెన్నై నందనంలోని వైఎంసీఏ మైదానంలో గ్రాండ్‌గా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.

ఇక ఈ సినిమాలో హుమాఖురేషి, సముద్రఖని, ఈశ్వరీరావు, సంపత్ రాజ్, సాయాజీ షిండే, అంజలి పాటిల్, మణికందన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు సంతోష్‌ నారాయణన్‌. ఈ అడియో వేడుకను ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో లైవ్‌లో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం.

- Advertisement -