బంగార్రాజు ‘నా కోసం’ సాంగ్ టీజర్

162
bangarraju
- Advertisement -

కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమా నుంచి విడుదల చేసిన లడ్డుండా అనే పాట, ఫస్ట్ లుక్ పోస్టర్లకు విశేషమైన స్పందన వచ్చింది. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు.

లడ్డుండా పాటతో ఏర్పడిన అంచనాలను ముందుకు తీసుకెళ్లేందుకు రెండో పాట ‘నా కోసం’ అంటూ సాంగ్ ప్రోమో విడుద‌ల చేశారు. ఇందులో కృతి శెట్టి, నాగ చైత‌న్య మ‌ధ్య సాంగ్ సాగిన‌ట్టు తెలుస్తుంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకి సంబంధించిన ఫుల్ వ‌ర్షెన్‌ను డిసెంబ‌ర్ 5 సాయంత్రం 5.12ని.ల‌కు రిలీజ్ చేయ‌నున్నారు. తొలిసారి చైతూ-కృతి జోడిగా నటిస్తుండంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. ఆ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. తండ్రీ కొడుకుల బంధాన్ని చక్కగా పండించి అందరినీ మెప్పించారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ఈ ‘బంగార్రాజు’ చిత్రంలో ఈ ఇద్దరూ మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.

- Advertisement -