విడుదలైన ‘ఓ సైనికా..’ వీడియో సాంగ్..

308
Na peru surya 'o sainika..' video song release..
- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా అను ఎమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా న‌టించిన తాజా చిత్రం ‘నాపేరు సూర్య’. ఈ సినిమా ఈ మధ్యే విడుదలై మంచి టాక్‌తో దూసుకెళుతుంది. ఈ చిత్రంతో వక్కంతపు వంశీ దర్శకుడిగా పరిచయమయ్యాడు. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మించారు. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత.

ఇందులో బన్నీ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించి తన నటనతో అభిమానులని ఎంత‌గానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు విశాల్‌- శేఖ‌ర్ సంగీతం అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు చిత్ర యూనిట్.

గతంలో ఇదే పాట లిరిక‌ల్ వీడియోని రిపబ్లిక్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అదే పాటకు సంబంధించిన సినిమాలోని పూర్తి వీడియోను అప్‌లోడ్ చేశారు చిత్ర బృందం. ఈ పాటకు లిరిక్స్ రామ జోగ‌య్య శాస్త్రి అందించగా విశాల్ శేఖర్ పాడారు. ఈ పాటలో బన్నీ నటన సూపర్భ్ అనిపిస్తుంది. దేశ భక్తి నేపధ్యంలో సాగే పాట పూర్తి వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

https://www.youtube.com/watch?v=JJpcCKKqc4k

- Advertisement -