యుఎస్‌లో ఎన్.శంక‌ర్ స్టార్ హంట్‌

429
N Shankar Star Hunt In USA
- Advertisement -

ఎన్‌కౌంట‌ర్‌, శ్రీరాముల‌య్య‌, జ‌యం మ‌న‌దేరా, భద్రాచ‌లం, జై బోలో తెలంగాణ వంటి చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న ఎన్‌.శంక‌ర్ సునీల్ హీరోగా మ‌ల‌యాళ చిత్రం టు కంట్రీస్‌ను రీమేక్ చేస్తున్నారు. ఎన్‌.శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంతో పాటు ఈ చిత్రానికి నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమాలో ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీక‌ర‌ణ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో తెలుగు అమెరిక‌న్స్ ఉంటే బాగుంటుంద‌ని భావించిన దర్శకుడు యుఎస్‌లో స్టార్ హంట్‌ను నిర్వ‌హిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా…ఎన్‌.శంక‌ర్ మాట్లాడుతూ – “మ‌హాల‌క్ష్మిఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం..2గా రూపొందుతోన్న చిత్రంలో కొంత మంది కొత్త న‌టీన‌టులకు ప‌నిచేసే అవ‌కాశాన్ని క‌ల్పించాల‌నుకున్నట్లు తెలిపారు. ఆర్లాండ్‌, న్యూయార్క్ న‌గరాల్లో ఆడిష‌న్‌ను నిర్వ‌హిస్తున్నామని…. ఆస‌క్తి ఉన్న‌వారు వారి ప్రొఫైల్‌తో తనని కలవొచ్చని తెలిపారు. 20-60 సంవ‌త్స‌రాల వ‌య‌సుండి, ఎన్నారైలు, అమెరికాలో ఉండే స్త్రీ, పురుషులెవ‌రైనా ఈ స్టార్ హంట్‌లో పాల్గొన‌వ‌చ్చు అన్నారు.

వేదికః
ఆర్లాండ్‌లో డిసెంబ‌ర్ 10 వ తేది ఉద‌యం ప‌ది గంట‌లు నుండి డిసెంబ‌ర్ 14న న్యూయార్క్‌లో స్టార్ హంట్‌కు హాజ‌రు కావ‌చ్చు.
ఈ-మెయిల్ః starhunt.nshankar@gmail.com

N Shankar Star Hunt In USA

- Advertisement -