పవన్ దర్శకుడికి వార్నింగ్

38
- Advertisement -

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ‘ఉస్తాద్ భగత్‌ సింగ్’ చిత్రం పై ఇప్పటికే ఎన్నో రూమర్లు వినిపిస్తున్నాయి. హరీష్ శంకర్ ఈ సినిమాకు గ్యాప్ ఇచ్చి.. రవితేజ సినిమా మీదకు షిఫ్ట్ అయ్యాడని టాక్. ఐతే, హరీష్ శంకర్ ‘ఉస్తాద్’ నుంచి బయటకు వచ్చేశా అని చెబుతున్నాడట. దీంతో, ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ హరీష్ శంకర్ పై సీరియస్ అవుతున్నారు. ఎహె, బయటికి వచ్చేశాను అని చెప్పకుండా… క్రియేటివ్ డిఫరెన్సెస్ అని చెప్పాలి అని మైత్రి వారు వార్నింగ్ ఇస్తున్నారట.

నిజానికి నాలుగేళ్ళ క్రితం హరీష్ శంకర్ హీరో వెంకటేష్ సినిమా నుంచి కూడా తప్పుకున్నాడు. ఆ సినిమా నుంచి తప్పుకున్న తర్వాత హరీష్ శంకర్ ఎక్కడా ఓ పదం కూడా బ్యాడ్ గా మాట్లాడలేదు. ఆ హీరోతో ఆ నిర్మాతతో నాకు పొసగడం లేదు, పడటం లేదు, ఇష్టం లేదు, అబ్బో కష్టం కాబట్టి తప్పుకున్నా వంటి ఏ పదాల జోలికీ హరీష్ శంకర్ పోలేదు. ఎందుకంటే..? మళ్లీ రిలేషన్స్ బాగుండాలి కదా… అందుకని తెలివిగా, మర్యాదగా క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటూ హరీష్ శంకర్ ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు.

Also Read:ఈ వారం చిత్రాల పరిస్థితేంటి ?

కానీ ‘ఉస్తాద్ భగత్‌ సింగ్’ విషయంలో మాత్రం హరీష్ శంకర్ కాస్త ట్రాక్ తప్పాడు. నిజానికి క్రియేటివ్ డిఫరెన్సెస్ అనే పదం సేఫ్ వర్డ్. సినిమాల్లో ఎవరైనా ఈ పదం వాడితే… తప్పుకుంటున్నాను అని మర్యాదగా ఎక్స్‌ప్రెస్ చేసినట్టు లెక్క. ఈ పదం కాకుండా వేరే పదాలు వాడుతూ.. సినిమా నుంచి బయటకు వచ్చేశా అంటే.. ఆ సినిమా పై నెగిటివ్ ప్రచారం చేసినట్టు లెక్కే. అయితే, ఇప్పటికీ అయితే, పవన్ కి ఈ విషయాలు ఏమీ తెలియదు. మరి పవన్ కళ్యాణ్ మళ్ళీ పిలిస్తే.. హరీష్ శంకర్ వెళ్లి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేసే ఛాన్స్ ఉంది.

Also read:Chiranjeevi:భోళా శంకర్ ట్రైలర్ డేట్ ఫిక్స్

- Advertisement -