సీసీసీకి మైత్రీ మూవీ మేకర్స్ విరాళం..

186
mythri movie makers

క‌రోనా వైర‌స్‌పై పోరాటంలో భాగ‌మ‌వుతూ ఇదివ‌రకే తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం స‌హాయ‌నిధుల‌కు చెరొక రూ. 10 ల‌క్ష‌ల చొప్పున రూ. 20 ల‌క్ష‌లను విరాళంగా ప్ర‌ముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత‌లు న‌వీన్ యెర్నేని, వై. ర‌విశంక‌ర్ అంద‌జేశారు.

తాజాగా శ‌నివారం క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి మ‌రో రూ. 5 ల‌క్ష‌ల‌ను వారు అంద‌జేశారు. ఈ విష‌యాన్ని న‌వీన్ యెర్నేని, వై. ర‌విశంక‌ర్ త‌మ సంస్థ అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలిపారు.

రూ. 20 ల‌క్ష‌ల‌కు అద‌నంగా.. లాక్‌డౌన్ నేప‌థ్యంలో సినిమా షూటింగ్‌లు లేక ఉపాధి కోల్పోయిన పేద క‌ళాకారులు, కార్మికుల‌ను ఆదుకోవ‌డం కోసం చిరంజీవి గారు ఏర్పాటుచేసిన క‌రోనా క్రైసిస్ చారిటీకి కూడా మేం రూ. 5 ల‌క్ష‌లు విరాళంగా అంద‌జేస్తున్నాం. క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో మేం చేతులు క‌లుపుతున్నాం. ఈ విష‌యంలో అంద‌రం ఒక్క‌ట‌వుదాం. ఇంట్లో ఉండండి.. జీవితాల‌ను కాపాడుకోండి” అని వారు ట్వీట్ చేశారు.