రండి దీపాలు వెలిగిద్దాం : భారత క్రికెటర్లు

140
hardhik

కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ఇవాళ రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా దీపాలు వెలిగించాలని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ప్రధాని మోడీ పిలుపుకు మద్దతు పలికారు భారత క్రికెటర్లు. హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, జ‌స్‌ప్రీత్ బుమ్రా ట్విట్టర్ వేదికగా దీపాలు వెలిగిద్దాం…సమైక్యతను చాటుదాం అని పిలుపునిచ్చారు.

చీకటిలో ఉన్న ప్రపంచానికి దారి చూపే యోధుల వ‌లే, మనము వెలుగును అందించాల్సిన అవసరం ఉందని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఆదివారం నాడు 9 గంటలకు 9 నిమిషాల పాటు క్రొవ్వ‌త్తుల‌ను, ప్ర‌మిద‌ల‌ను వెలిగించాలని రాహుల్ ట్వీట్ చేశాడు.