ప్రతి ఒక్కరికీ ఇది ఛాలెంజింగ్ టైమ్. కోవిడ్-19పై పోరాటంలో ఏ ఒక్కరూ ఉపేక్షించకూడని కాలం అని మైత్రీ మూవీ మేకర్స్ నిర్వహకులు నవీన్ యెర్నేని,వై. రవిశంకర్‌లు తెలిపారు. ఈ సంక్షోభ కాలంలో అటు కేంద్ర ప్రభుత్వం,ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రభావవంతమైన చర్యలను ప్రశంసించకుండా ఉండలేమన్నారు.
ఈ క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి మా వంతు భాగస్వామ్యం.. అది చిన్నదే కావచ్చు.. అందిస్తున్నాం. కరోనాపై పోరాటానికి మద్దతుగా రూ. 20 లక్షలు విరాళంగా అందజేస్తున్నాం. వీటిలో రూ. 10 లక్షలు తెలంగాణ ప్రభుత్వానికీ, రూ. 10 లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ అందిస్తున్నామన్నారు.
ఆపద సమయంలో ఎక్కువ కుటుంబాలకు సాయపడేందుకు మరింత మంది ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. ఈ సంక్షోభాన్ని సమష్టిగా మనం అధిగమించగలం. సామాజిక దూరాన్ని పాటిస్తూ, కరోనా మహమ్మారిపై జరిపే పోరాటంలో విజయం సాధిద్దాం. సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండండి.. ఇంట్లో ఉండండి.అని అన్నారు.