మైత్రీ మూవీ మేకర్స్..కాస్టింగ్ కాల్

214
mythri movies

తెలుగు సినీ చరిత్రలో సురేష్ ప్రొడక్షన్స్, వైజయంతి మూవీస్,విజయ సంస్థ వంటి ఎన్నో నిర్మాణ సంస్థలు అగ్ర సంస్థలుగా పేరు తెచ్చుకోవడానికి ఎన్నో ఏళ్ళు పట్టింది. అలాంటిది కేవలం మూడు సినిమాలతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అగ్ర నిర్మాణసంస్థల సరసన స్తానం సంపాదించుకుంది మైత్రీ మూవీస్. తెలుగులో ఓ బ్రాండ్ పేరు తెచ్చుకున్న మైత్రీ మూవీస్‌విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేస్తూ వ‌రుస విజ‌యాలతో దూసుకుపోతున్నారు.

తాజాగా ఈ సంస్థ కాస్టింగ్ కాల్ ఇచ్చింది. 9 నుండి 11 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న అమ్మాయిలు మేక‌ప్ లేకుండా త‌మ ఫోటోల‌ని వాట్సాప్ చేయాల‌ని కోరింది. సినిమాలో న‌టించాల‌నే ఆస‌క్తి ఉన్న బాలిక‌లు ల‌క్కీ ఛాన్స్ కొట్టేయాలని సూచించారు.

న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్, మోహ‌న్ క‌లిసి మైత్రి మూవీ మేకర్స్ ని స్ధాపించారు. మైత్రి మూవీ మేకర్స్ బేన‌ర్‌పై రూపొందిన శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్ , రంగ‌స్థ‌లం, చిత్ర‌ల‌హ‌రి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. ఇప్పుడు ఈ బేన‌ర్‌లో డియ‌ర్ కామ్రేడ్, గ్యాంగ్ లీడ‌ర్, వైష్ణ‌వ్ తేజ్ డెబ్యూ చిత్రం,అల్లు అర్జున్ 20వ చిత్రం రూపొందుతున్నాయి.