తెలంగాణ హోంగార్డుల జీతాల పెంపు..

368
kcr home guards
- Advertisement -

తెలంగాణ హోంగార్డులకు మరోసారి శుభవార్తనందించింది తెలంగాణ ప్రభుత్వం. హోంగార్డుల జీతాలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో వారి జీతం ప్రస్తుతం రూ. 22 వేలకు చేరింది. ఇకపై హోంగార్డులకు కూడా కానిస్టేబుళ్లతో సమానంగా ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు అందనున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హోంగార్డుల జీతం రూ రూ. 12 వేలుగా ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2018 జనవరి నుంచి వారి వేతనాన్ని రూ. 20 వేలకు పెంచింది. ప్రతీ ఏటా ఏప్రిల్‌ నుంచి వెయ్యి రూపాయలు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో 2018 ఏప్రిల్‌లో హోంగార్డుల వేతనం రూ. 21 వెయ్యికి పెరిగింది. 2019 ఏప్రిల్‌లో మరో వెయ్యి పెరగడంతో ఇప్పుడు హోంగార్డుల వేతనం రూ. 22 వేలకు చేరింది.

KKP_1002

దీంతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లలో హోంగార్డులకు ప్రత్యేక కోటా,హెల్త్ స్కీమ్‌,బీమా సదుపాయాలను కల్పించనుంది. ట్రాఫిక్‌ విధులునిర్వర్తించే హోంగార్డులకు పోలీసుల తరహాలో గౌరవవేతనంపై 30 శాతం అదనంగా ఇవ్వనున్నారు. మహిళా హోంగార్డులకు ఆరు నెలలు మాతృత్వపు సెలవులు, పురుష హోంగార్డులకు 15 రోజులపాటు పితృత్వపు సెలవులు కూడా ఇవ్వనున్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో 18500 మంది హోంగార్డులు ఉన్నారు. ఇప్పటికే కానిస్టేబుల్‌ రిక్రూట్ మెంట్‌ లో హోంగార్డులకు ప్రత్యేక రిజర్వేషన్‌ అమల్లో ఉంది. స్పెషల్‌ పోలీస్‌లో 25 శాతం,జిల్లాల్లో రిజర్వ్ డ్ పోలీసులకు 15 శాతానికి,పీటీవో డ్రైవర్లకు 20 శాతం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -