తాజాగా మలయాళ చిత్రసీమకి చెందిన మైథిలీ అనే నటీమణి తనను కిరణ్ కుమార్ అనే వ్యక్తి వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం అందరినీ షాక్‌కు గురిచేసింది. తన ప్రైవేట్ ఫొటోలను తీసి అతడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మైథిలీ చెబుతోంది. డెబ్బై ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ.. తనను బెదిరిస్తున్నాడని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి కథనం మేరకు… ఆమె గతంలో కిరణ్ కుమార్ అనే వ్యక్తితో అనుబంధాన్ని కలిగి ఉండేది. పెళ్లి చేసుకుంటాననే హామీతో అతడు ఆమెకు దగ్గరయ్యాడు. అయితే అతడికి అప్పటికే పెళ్లి అయ్యింది. ఆ విషయం తెలియనీయకుండా మైథిలిని లోబరుచుకున్నాడు కిరణ్ కుమార్. ఆమెతో సన్నిహితంగా గడిపినప్పుడు వీడియోలు, ఫొటోలు తీసుకున్నాడు. ఆమె నగ్న చిత్రాలనూ తీశాడు. అతడికి పెళ్లి అయిపోయిందన్న విషయం గ్రహించి మైథిలీ దూరం అయ్యింది.
అయితే కిరణ్ కుమార్ ఇప్పుడు ఆమె వెంట పడుతున్నాడట. 75 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేకపోతే ఫొటోలను ఇంటర్నెట్ లో పెడతాను అని అతడు బెదిరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
పలుసార్లు షూటింగ్ స్పాట్స్ కు కూడా వచ్చాడని.. డబ్బుల విషయంలో తనను బెదిరించాడని మైథిలి తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్టుగా పోలీసులు ప్రకటించారు. కిరణ్ కుమార్ సినీ రంగానికి చెందిన వ్యక్తే అని, అతడొక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అని, అతడిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.