- Advertisement -
పహాల్గం ఉగ్రదాడి తర్వాత భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తత నెలకొనగా భారత్‌లో దాయాది దేశంపై తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్‌లో కరాచీ బేకరి పేరు మార్చాలని కొంతమంది దాడి సైతం చేసిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ప్రజలు ఎక్కువగా ఇష్టపడే మైసూర్ పాక్ పేరు మారింది. ఓ స్వీట్ షాపు యమజాని మైసూర్ పాక్ పేరును మైసూర్ శ్రీగా మార్చాడు. రాజస్థాన్ జైపూర్ లో గల ప్రముఖ “త్యోహర్ స్వీట్స్” యజమాని తన షాపులో మైసూరు పాక్ పేరును మైసూరు శ్రీ గా మార్చాడు.
అలాగే మోతీ పాక్, ఆమ్ పాక్, గోండ్ పాక్ స్వీట్ పేర్లను సైతం మోతీ శ్రీ, ఆమ్ శ్రీ, గోండ్ శ్రీ గా పేర్లు మార్చేశాడు. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read:KTR:రేవంత్ రాజీనామా చేయాల్సిందే
- Advertisement -

