ఫిక్సింగ్ ఆరోపణలతో భారత బౌలర్ శ్రీశాంత్‌పై 7 సంవత్సరాల నిషేధం పడిన సంగతి తెలిసిందే. ఈ సెప్టెంబర్‌లో ఏడు సంవత్సరాల గడువు ముగిసిపోనుండగా దీనిపై స్పందించారు శ్రీశాంత్.
తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకుంటాననే నమ్మకం తనకుందని తెలిపాడు శ్రీశాంత్. కేరళ జట్టులో చోటు సంపాదించడం తనముందున్న ప్రధమ కర్తవ్యమని తర్వాత జాతీయ జట్టులో స్ధానం దక్కించుకుంటానని తెలిపాడు.
ఫిక్సింగ్ ఆరోపణలతో తన జీవితంపై చెరగని మచ్చపడిందని అప్పటినుండి తన ఫ్రెండ్స్‌తో పాటు చాలా మంది ఆటగాళ్లు నన్ను దూరం పెట్టారని చెప్పారు. సెహ్వాగ్ భాయ్, లక్ష్మణ్ లు నాతో సన్నిహితంగా ఉంటారని అయితే వారి భయాన్ని అర్ధం చేసుకుని తాను వారితో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించలేదన్నాడు శ్రీశాంత్.
2011 ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంకతో తన చివరి వన్డే ఆడాడు శ్రీశాంత్. ఆరు నెలల తరువాత ఇంగ్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం శ్రీశాంత్ వయస్సు 37.