సిరిసిల్లను వందరేట్లు అభివృద్ధి చేస్తా..

254
- Advertisement -

సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తనను మరోసారి గెలిపిస్తే.. సిరిసిల్లను వందరేట్లు అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కోన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందిస్తున్నామని.. పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి పథకం అందిస్తున్నామని.. అర్హులందరికి పెన్షన్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు.

మూడేళ్లలో సిరిసిల్ల రూపురేఖలు మార్చామని.. పేదల సంక్షేమానికి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తాము అభివృద్ధి చేస్తుంటే.. అన్ని పార్టీలు కలిసి టీఆర్ఎస్ ను గద్దె దించుతామంటున్నాయని.. అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన కేసీఆర్ ను గద్దె దించాలన్న ప్రతిపక్షాల విమర్శలపై ప్రజలు ఆలోచించాలన్నారు. గత నాలుగేళ్లలోనే ఇసుక ఆదాయం రూ. 2 వేల కోట్లకు తెచ్చామని.. ప్రతి ఎకరానికి సాగునీరిచ్చేందుకు ప్రాజెక్టులు కడుతుంటే.. కాంగ్రెస్ నేతలు చనిపోయినవారి వేలిముద్రలతో ఫోర్జరీ చేసి కోర్టుల్లో కేసులు వేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి నుంచి ఆకాశం వరకు కాంగ్రెస్ నాయకులు దేనిని కూడా వదల్లేదని.. చేనేత కార్మికుల బతుకుల్లో తాము వెలుగులు నింపామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆర్డర్ తో కార్మికుడు నెలకు రూ. 10 వేల వేతనం పొందుతున్నాడని.. తనపై విశ్వాసం ఉంటే మరోసారి తనను గెలిపించాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

- Advertisement -