నన్ను అర్థం చేసుకోవడం నా అదృష్టం..

237
My good fortune is to get my husband..
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ కరీనాకపూర్ నటుడు సైఫ అలీఖాన్ తో వివాహం అయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే పెళ్లికావడంతో చాలా రోజులు కెమెరాకు దూరమైంది కరీనాకపూర్. ఇక ఆమె సినిమాల్లో నటించరన్న వార్తలు కూడా అప్పట్లో జోరుగా వినిపించాయి. తన భర్తతో పెళ్లిచేసుకుని రెండు సంవత్సరాల తర్వాత తైమూర్ అలీఖాన్ కు జన్మనిచ్చింది. అయితే రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టింది కరీనా.

 My good fortune is to get my husband..

ఆమె ప్రస్తుతం ‘వీర్ డి వెడ్డింగ్’ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలెకర్ల సమావేశంలో కరీనా మాట్లాడుతూ..తాను ఈ సినిమాకు సైన్ చేసినపుడు గర్భవతిని కాదని… అనంతరం గర్భం దాల్చడంతో ఈ సినిమా నిర్మాత అయిన రియానుతో మాట్లాడి తన స్థానంలో ఇతర హీరోయిన్‌లను తీసుకోవాలని కోరాను. కాని రియా అలా కాకుండా వేచిఉంటానని చెప్పాడని కరీనా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దీంతో జిమ్ కు వెళ్లి కసరత్తులు చేసి మళ్లీ సినిమాల్లో నటించమని తన భర్త ప్రేరేపించాడని ఆమె చెప్పారు. ‘‘నన్ను అర్థం చేసుకునే భర్త రావడం నా అదృష్టం అన్నారు కరీనా.

- Advertisement -