టీఆర్‌ఎస్‌లోకి ముత్తారం కాంగ్రెస్ నేతలు..

55
trs
- Advertisement -

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం ముత్తారం గ్రామం కాంగ్రెస్ పార్టీ కి చెందిన నాయకులు, కార్యకర్తలు 100 మంది టీఆరెఎస్ లో చేరారు. అలాగే హాఠ్యా తండా శివారు లచ్చీ రామ్ తండాకు తండా మొత్తం టీఆరెఎస్ లో చేరారు. వీళ్లంతా రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో టీఆరెఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.

రాష్ట్రంలో సీఎం కెసీఆర్, నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై టీఆరెఎస్ లో చేరుతున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్తగా కాంగ్రెస్ నుంచి టీఆరెఎస్ లో చేరిన వాళ్లకు తగు గౌరవం, గుర్తింపు ఉంటుందన్నారు. టీఆరెఎస్ పార్టీ మాత్రమే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తున్నదని, బీమా సదుపాయం కల్పిస్తున్నది అన్నారు. తను కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆ గ్రామాల టీఆరెఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.టీఆరెఎస్ లో చేరిన వారిలో…. లచ్చిరం తండాకు చెందిన ఏడవ వార్డు సభ్యురాలు లకావత్ స్వరూప, లకావత్, చక్రి, గోపియా, భుజంగం, దేవా, శీను తదితరులు ఉన్నారు.

- Advertisement -