ఆవాల నూనెతో ప్రయోజనాలు!

86
- Advertisement -

ఆవాలను నిత్యం వంటింట్లో అన్నీ రకాల కూరల్లో ఉపయోగిస్తుంటాము. ఇవి కూరల రుచిని పెంచడంతో ఎంతగానో ఉపయోగపడతాయి.. ఆయుర్వేదంలో కూడా ఆవాలను ఉపయోగిస్తుంటారు ఆయుర్వేద వైద్యులు. ఇక వీటితో నూనె కూడా తయారు చేస్తారు. అవాల నూనె వాడకం దక్షిణాదిన తక్కువగా ఉన్నప్పటికీ ఉత్తరాదిన ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ ఆవనూనెను వంటల్లో కంటే ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఆవనూనె లో ఎరుసిక్ ఆమ్లం, ఒలియక్ ఆమ్లం ఎక్కువగా ఉంటాయి. అలాగే ఒమేగా 3,6 వంటి ఫ్యాటీ యాసిడ్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధులను దూరం చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. .

ఇంకా ఆవనూనె లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని సూక్ష్మజీవులను నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి తద్వారా సీజనల్ వ్యాధులను ఎదుర్కోవచ్చు. ఇంకా జుట్టు సంక్రక్షణలోనూ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ అవానూనె ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇంకా ఆవాల నూనెలో క్యాన్సర్ ను తగ్గించే గుణాలు కూడా ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా ఈ నూనె తేలికగా ఉండడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ శాతం కూడా తగ్గుతుందని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆవాల నూనెను వంటల్లో వాడటం వల్ల రక్తపోటు, షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. ఇంకా జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులను నివారించడంలో అవాల నూనె ప్రభావవంతంగా పని చేస్తుందని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.

Also Read:క్యాన్సర్ ముప్పు తగ్గించుకోండిలా!

- Advertisement -