రాష్ట్రంలో బక్రీద్ సందడి కనిపిస్తోంది. బక్రీద్ పండగ వస్తోందంటేనే, అందరికీ ఖుర్బానీ గుర్తుకు వస్తుంది. హజరత్ ఇబ్రహీం త్యాగం కళ్లముందు కదలాడుతుంది. బక్రీద్ అంటేనే…..త్యాగాన్ని గుర్తు చేసుకోవడం. బక్రీద్ కు మరో పేరే …..ఈదుల్ జుహా. బకర్ అంటే…. గొర్రె అని అర్థం. ఖుర్బానీ అంటే త్యాగం. బక్రీద్ అనగానే ….అందరికీ పొట్టేళ్లను ఖుర్బానీ ఇవ్వడం గుర్తుకు వస్తుంది.
బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్ లోని మసీదులు, ఈద్గాలు సుందరంగా ముస్తాబయ్యాయి. బక్రీద్ పండగ రోజు ఇచ్చే ఖుర్బానీకి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే మేకలు, గొర్రెలు, పొట్టేల్లు నగరానికి విచ్చేశాయి. చార్మినార్, సైదాబాద్, చంచల్ గూడ, ఖర్బలా మైదాన్, మెహదీపట్నం, టోలీచౌకీ, నాంపల్లి, సికింద్రాబాద్, ముషీరాబాద్ ప్రాంతాలలో గొర్రెలు, మేకలు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
హైదరాబాద్‌కు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి పొట్టేళ్లు దిగుమతి చేసుకుంటున్నారు. వీటితోపాటు మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, అచ్చంపేట, నిజామాబాద్, అనంతపూర్, ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి కూడా మూగజీవాలు వస్తున్నాయి. బక్రీద్ పండుగ కారణంగా మేకల ధరలు రెట్టింపు అయ్యాయి. 20 నుంచి 30 కిలోల జీవాలు దాదాపు 15 నుంచి 20 వేల రూపాయల వరకూ పలుకుతున్నాయి.