పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎదుర్కొన్న పరాజయానికి ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) వల్ల ఓటర్ల తొలగింపు కారణంతో పాటు ముస్లిం ఓట్ల చీలిక దెబ్బ తీసిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఎన్నికలకు ముందు బెంగాల్‌లో సుమారు 90 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించారు. ఇందులో అత్యధికంగా హిందువులు (63%) ఉన్నప్పటికీ, జనాభా ప్రాతిపదికన చూస్తే ముస్లింల (34%) తొలగింపు కూడా ఎక్కువగా ఉంది.
2021లో ముస్లిం ఓటర్లు ఏకపక్షంగా మమతా బెనర్జీకి మద్దతు ఇచ్చారు. కానీ 2026లో ఈ ఓట్లు వివిధ పార్టీల మధ్య చీలిపోయాయి.
కాంగ్రెస్ మరియు లెఫ్ట్ కూటమి..మైనారిటీ ఓట్లలో గణనీయమైన భాగాన్ని దక్కించుకున్నాయి.హుమాయున్ కబీర్ (AJUP).. మాజీ టీఎంసీ నేత హుమాయున్ కబీర్ స్థాపించిన పార్టీ ముర్షిదాబాద్ వంటి జిల్లాల్లో టీఎంసీని దెబ్బతీసింది.
ISF.. లెఫ్ట్ ఫ్రంట్ మద్దతు ఉన్న ఐఎస్ఎఫ్ కూడా ముస్లిం ఓట్లను చీల్చడంలో కీలక పాత్ర పోషించింది.అసెంబ్లీలో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య పెద్దగా తగ్గలేదు (2021లో 44 ఉండగా, ఇప్పుడు 40). కానీ, టీఎంసీకి చెందిన ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య 43 నుండి 34కి పడిపోయింది. అంటే, మైనారిటీ ఓటర్లు టీఎంసీకి ప్రత్యామ్నాయంగా ఇతర లౌకిక పార్టీల వైపు మొగ్గు చూపారు.
ముస్లిం ఓట్లు ఇలా మూడు, నాలుగు పార్టీల మధ్య చీలిపోవడం వల్ల అంతిమంగా బీజేపీకి లాభం చేకూరింది. ముఖ్యంగా సౌత్ బెంగాల్‌లోని టీఎంసీ కోటల్లో బీజేపీ అనూహ్య విజయాలు సాధించడానికి ఈ ఓట్ల చీలికే ప్రధాన కారణమైంది. ముస్లిం జనాభా అత్యధికంగా ఉండే ముర్షిదాబాద్ జిల్లాలో టీఎంసీ తన కనిష్ట ఓటు షేరును నమోదు చేయడం గమనార్హం. ఇక్కడి ఓటర్లు టీఎంసీ రాజకీయాల కంటే ఇతర ప్రత్యామ్నాయాలను ఎంచుకున్నారు.
Also Read:షారుఖ్-దీపికా ‘కింగ్’..షూటింగ్ లీక్!
టీఎంసీ తన ఓటమికి ‘SIR’ ద్వారా జరిగిన ఓట్ల తొలగింపును కారణంగా చూపుతున్నప్పటికీ, వాస్తవానికి ముస్లిం ఓటర్ల విశ్వాసాన్ని కోల్పోవడం మరియు ఓట్లు చీలిపోవడమే మమతా బెనర్జీ ప్రభుత్వ పతనానికి దారితీసిందని గణాంకాలు సూచిస్తున్నాయి.

