Elon Musk:ది అమెరికా పార్టీ..ప్రకటన

5
- Advertisement -

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన పార్టీని అనౌన్స్ చేసేశాడు. ట్రంప్ హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోకుండా సొంత పార్టీని ప్రకటించాడు. ‘ది అమెరికా పార్టీ’ స్థాపిస్తున్నానని… అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మస్క్ చెప్పారు.

మీరు కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నారు. అది మీకు తప్పక వస్తుంది. పనికిరాని నిర్ణయాలు, అవినీతి మన దేశాన్ని దివాలా తీసే విషయానికి వస్తే, మనం ప్రజాస్వామ్యంలో కాదు, ఏక పార్టీ వ్యవస్థలో జీవిస్తున్నాము. నేడు, మీకు స్వేచ్ఛ తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడింది అని తెలిపాడు.

బిగ్ బ్యూటీఫుల్ బిల్లు విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కు తగ్గకుంటే అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని మస్క్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -