ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు… కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని తీసుకునే అవకాశం ఉన్నా, ఎందుకు తీసుకోవట్లేదు? చెప్పాలన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని తెచ్చుకునే అవకాశం ఉంది అన్నారు.
కేసీఆర్ ముందుచూపుతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 141 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లను నిర్మించారు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయాయి…కాంగ్రెస్, బీజేపీ ఢిల్లీలో కొట్లాడుతాయి.. గల్లీలో కలిసిపోతాయి అన్నారు. కాళేశ్వరం విషయంలో NDSA పేరుతో ఎందుకు కాలయాపన చేస్తున్నారు?అన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, రైతు ప్రయోజనాల కన్నా చిల్లర రాజకీయాలకే ప్రాధాన్యమిస్తోంది…. రేవంత్ రెడ్డి స్థాయికి కేటీఆర్, నేనే చాలు.. ఈ మాట వాళ్ళ మంత్రి కోమటిరెడ్డే చెప్పిండు …రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డను అని అక్కడి ప్రజల నోరు, కడుపు కొడుతున్నాడు అన్నారు. మే 30న శ్రీశైలంలో వరద వచ్చింది.. ఇప్పటికి 36 రోజులైనా ఇంత వరకి కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయలేదు అన్నారు.
ఇన్ని రోజులైనా ఎందుకు కల్వకుర్తికి నీళ్లు ఇవ్వరు.. అంటే చంద్రబాబుకి మళ్లీ పోయిన సంవత్సరం లాగా నీళ్లు వదిలిపెడతావా?, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కృష్ణానదిలో అతి తక్కువ నీళ్లు వాడుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నారు. ఏపీలో చంద్రబాబుకి 65 టీఎంసీలు నీళ్లు గురుదక్షణ కింద ధారాదత్తం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి – హరీష్ రావు పోలవరం డయాఫ్రం వాల్, గైడ్ వాల్ కొట్టుకుపోయి రూ.2000 కోట్లు నష్టం అయితే NDSA అక్కడికి వెళ్లదు… SLBC టన్నెల్ కూలిపోయి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్ధకంలో పడితే NDSA రాదు అన్నారు.
అదే మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే కిషన్ రెడ్డి NDSAను వెంటనే పంపిండు.. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డితో కలిసి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు… కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయారు.. ఢిల్లీలో కొట్లాడుతారు, గల్లీలో అలయ్ బలయ్ చేసుకుంటారు అని ఎద్దేవా చేశారు.
Also Read:తొలి ఏకాదశి విశిష్ఠత..

