మానేరు తీరంలో మ్యూజికల్ ఫౌంటేన్‌..

253
ktr siricilla
- Advertisement -

సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఎమ్మెల్యే కేటీఆర్. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ ఘాట్ వద్ద మ్యూజికల్ ఫౌంటేన్‌ను ప్రారంభించారు. విరజిమ్ముతున్న రంగు రంగుల ఎల్‌ఈడీ వెలుగులు రాత్రిపూట ఆహ్లాదకరంగా కనిపిస్తుండటంతో స్ధానికుల నుండి మంచిస్పందన వస్తోంది.

దీంతో పాటు జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించారు. దసరా వరకు కలెక్టరేట్ భవనాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తున్న చెరువు పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.అంతకముందు సిరిసిల్లలో ఏర్పాటుచేసిన 5 రూపాయల భోజన పథకాన్ని ప్రారంభించారు. స్వయంగా ప్రజలకు వడ్డించిన కేటీఆర్ వారితో కలిసి భోజనం చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మ వద్ద పెరిగిన నిరుపేద యువతి శివరాత్రి మౌనిక పెళ్లికి కెటిఆర్ రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.

- Advertisement -