అవసరాల పేరుతో చెట్లను నరుకుతున్నాం : మణిశర్మ

130
manisharma
- Advertisement -

మానవ అవసరాల పేరుతో చెట్లను నరుకుతూ పోతే చివరికి మనిషి మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందన్నారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ జీహెచ్ఎంసీ పార్క్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆయన మొక్కలను నాటారు.


మణిశర్మ మాట్లాడుతూ.. ప్రకృతి మనకు దేవుడు ఇచ్చిన వరం. ఈ ప్రకృతి బావున్నప్పుడే ఈ నేలపై మనం జీవించగలుగుతాం. మనం బ్రతకాలంటే చెట్లు కావాలి. చెట్లు కావాలంటే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటాలి. వాటిని సంరక్షించాలి. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని అత్యంత ప్రేమతో కొనసాగిస్తున్న రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలాని కోరారు. తనవంతుగా నా శిష్యుడు తమన్ కు, తనయుడు మహతీ స్వరసాగర్ కు ఛాలెంజ్ విసురుతున్నట్టు ఆయన తెలిపారు.

- Advertisement -