మూసీ సుందరీకరణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, డాక్టర్ కురువ విజయ్ కుమార్, తొట్ల స్వామి యాదవ్‌తో పాటు వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేందుకు వెళ్లినప్పుడు వారిని అరెస్టు చేయించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ మొండి వైఖరికి నిదర్శనం అని మండిపడ్డారు.
ప్రజాపాలన అని చెప్పుకుంటూ ప్రజల అభిప్రాయాలను వినకుండా అరెస్టులకు నిరంకుశ కాంగ్రెస్ సర్కార్ పాల్పడుతోందని..మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తన మొండి వైఖరిని మార్చుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
Also Read:జియో ఐపీవోపై అంబానీ

