ఈ నెల10న “తెలంగాణ బత్తాయి డే’..

283
Musambi day in Telangana on May 10nth
- Advertisement -

టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు, “తెలంగాణ బత్తాయి డే’ కార్యక్రమంను అనుసరించి, మే 10న ఉదయం 10 గంటలకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా 500ల మంది క్రీడాకారులకు బత్తాయి పండ్లు యల్.బి స్టేడియంలో పంపిణి చేయడం జరుగుతుంది.

శరీరంలో అనేక చర్యలు సాఫీగా జరగాలంటే విటమిన్‌ సి తప్పనిసరని ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. మే 10న నిర్వహించే “తెలంగాణ బత్తాయి డే”ని పురస్కరించుకొని ప్రజలు పెద్ద ఎత్తున బత్తాయి పండ్లను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బత్తాయి పండ్లను తినటం వల్ల కలిగే లాభాలను విడమర్చి చెప్పారు. మిటమిన్‌ సి పుష్కలంగా ఉండే బత్తాయి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల రోజువారి దినచర్య సాఫీగా సాగుతుందని అన్నారు.

Musambi day in Telangana on May 10nth

కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బత్తాయి పండ్లను పుష్కలంగా తినాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. బత్తాయి పండ్లలో యాంటి యాక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరం చురుగ్గా ఉండటంతో పాటు ఎముకల పటుత్వం, కంటి చూపు మెరుగుపడుతుందని స్పష్టం చేశారు. స్కర్వీ వ్యాధి నివారణకు, జీర్ణక్రియ సాఫీగా సాగడానికి సి విటమిన్ పుష్కలంగా ఉండే బత్తాయి పండ్లు దివ్యౌషధంగా పనిచేస్తయని ఆయన అన్నారు.

బత్తాయి పండ్లను బాగా తినటం వల్ల శరీరం పోషకాలను బాగా గ్రహించి రోగనిరోధక వ్యవస్థ పెంపొందుతుందని అన్నారు. బత్తాయి పండ్లను కొనుగోలు చేసి వాటిని సాగుచేసే రైతులను ఆదుకోవాలన్న సీఎం కేసీఆర్ మాటలను కూడా ఎంపీ సంతోష్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారని అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.

- Advertisement -