- Advertisement -
బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు దర్శకుడు దక్షిణాది ఫిల్మ్‌మేకర్ ఏఆర్ మురుగదాస్, ఆయన తదుపరి చిత్రం మధరాసి.
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మురుగదాస్, సికందర్ ఘోర పరాజయంపై స్పందించారు. సినిమా డిజాస్టర్‌గా మిగలడానికి సల్మాన్ ఖాన్ కారణమని.. సల్మాన్‌తో పనిచేయడం సులభం కాదు. ఆయన తరచుగా రాత్రివేళల్లోనే సెట్స్‌కి వచ్చేవారు అన్నారు.
పగటిపూట చిత్రీకరించాల్సిన సన్నివేశాలను రాత్రివేళల్లో కృత్రిమ లైట్ల కింద తీయాల్సి వచ్చేది… తర్వాత వాటిని సీజీతో సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అంతేకాదు, చివరి నిమిషంలో పలు మార్పులు రావడంతో నా విజన్ పూర్తిగా దెబ్బతిందని సల్మాన్‌పై సెన్సేషన్ కామెంట్స్ చేశారు.
సల్మాన్ అభిమానులు ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:యూరియా కొరత నిజమే:తుమ్మల
- Advertisement -

