వైఎస్ జగన్‌పై హత్యాయత్నం..

220
jagan
- Advertisement -

విశాఖపట్నం విమానాశ్రయంలో కలకలం చోటుచేసుకుంది. ఏపీ ప్రతిపక్ష నేత,వైసీపీ చీఫ్ జగన్‌పై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. సెల్ఫీ పేరుతో జగన్‌ దగ్గరికి వచ్చిన  దాడి చేయడంతో జగన్ భుజానికి గాయమైంది. వెంటనే స్పందించిన పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

దాడిచేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్టులోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌గా గుర్తించారు. జగన్‌పై దాడి ఘటనతో అక్కడున్న వారు అవాక్కయ్యారు మరోవైపు జగన్ అక్కడే ప్రథమ చికిత్స చేయించుకుని, అనంతరం, హైదరాబాదుకు బయల్దేరారు.

294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌ గురువారం హైదరాబాద్‌ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్‌లో ఉండగా.. సెల్ఫీ పేరుతో దగ్గరికి వచ్చి దాడికి పాల్పడ్డాడు దుండగుడు.

మరోవైపు జగన్‌పై దాడిని వైసీపీ నేతలు,ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. ఎయిర్‌పోర్టులో భద్రతాసిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే దాడి జరిగిందన్నారు. ప్రమాద ఘటనపై గవర్నర్ నరసింహన్ ఆరా తీశారు.

- Advertisement -