శ్రీలంక నార్త్ ప్రావిన్స్‌ గవర్నర్‌గా మురళీధరన్‌

448
muralitharan
- Advertisement -

శ్రీలంక మాజీ క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్‌ త్వరలో గవర్నర్ కానున్నారు. నార్త్ ప్రావిన్స్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించాలని మురళీని ఆహ్వానించారు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. అధ్యక్షుడి విజ్ఞప్తి మేరకు మురళీ గవర్నర్ బాధ్యతలను స్వీకరించనున్నట్లు సమాచారం.

రాజపక్స లంక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగా మహేంద్ర రాజపక్క ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇక రాజపక్స ప్రభుత్వంలో మురళీధరన్‌తో పాటు అనురాధ యహంపతి ఈస్ట్ ప్రావిన్స్‌, తిస్సా వితర్ణ నార్త్‌ సెంట్రల్‌ ప్రావిన్స్‌లకు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని రాష్ట్రపతి సచివాలయ వర్గాలు తెలిపాయి.

తన క్రికెట్ కెరీర్ లో ఎన్నోమైలురాళ్లు అధిగమించాడు మురళీ. 1992 లో టెస్టు క్రికెట్ ,1993లో వన్డే క్రికెట్ లోకి ముత్తయ్య మురళీధరన్ ప్రవేశించాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నారు.టెస్ట్ ఫార్మాట్‌లో, వన్డేల్లో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. శ్రీలంక తరఫున 133 టెస్టులు ఆడిన మురళీ 800 వికెట్లు పడగొట్టాడు. 350 వన్డేల్లో 534 వికెట్లు, 12 టీ20ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.

Deshabandu Muttiah Muralitharan is a Sri Lankan cricket coach and former cricketer who was rated the greatest Test match bowler ever by Wisden Cricketers’ Almanack in 2002.

- Advertisement -